- పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్న యువత
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ జన్మభూమి కాలనీ, ఎల్లమ్మబండ జరపాటి నవీన్ ఆధ్వర్యంలో స్థానిక యువత రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. తెలంగాణ సర్కారు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, ఆల్విన్ కాలనీ డివిజన్ లో సమస్యలు, రోడ్లమీద డ్రైనేజీ వాటర్ ఏరులై పారుతున్నా, పేరుకుపోయిన చెత్తాచెదారం నుంచి వెలువడుతున్న దుర్గంధంతో జనాలు బాధపడుతున్న అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మడంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని, ప్రలోభాలతో యువతను చెడు మార్గంలోకి తీసుకెళుతున్నారని తెలియజేస్తూ, అతి త్వరలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో బబ్లు, అంజి, రవి మురళి, సిద్దు, మహేష్ వంశీ, ప్రేమ్ కుమార్, నరేష్ ప్రవీణ్, నాయకులు నర్సింగ్ రావు యాదవ్ గోపాలరావు, భూపాల్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.