- బ్రహ్మరథం పట్టిన ప్రజలు
- మొదటి రోజు తారానగర్, లింగంపల్లి విలేజ్ లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లో మొదటి రోజు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా ప్రారంభమైంది. అంతకుముందు తారనగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయంలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కోరారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని తారనగర్, లింగంపల్లిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు తిరుగుతూ ఓటు వేయమని ప్రజలను కోరారు. డివిజన్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలు చేరుతున్నాయన్నారు.
రైతులకు, వృద్ధులకు, మహిళలకు, యువకులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సీఎం కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తప్పక మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ కు ఓటేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, వార్డు మెంబర్స్ శ్రీకళ, కవిత గోపాలకృష్ణ, పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు, యువ నాయకులు మహిళా నాయకురాలు, బూత్ కమిటీ మెంబర్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు.