నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి అపార్ట్ మెంట్ వాసుల మద్దతు లభిస్తున్నది. స్వచ్ఛందంగా వారికి వారే ఈసారి తమ ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి రవికుమార్ యాదవ్ ని గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ మియాపూర్ డివిజన్ షిరిడి సాయి సదన్ –మందాడి అపార్ట్ మెంట్ వాసుల మద్దతు కోరగా.. సానుకూల స్పందన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో భిక్షపతి యాదవ్ చేసిన అభివృద్ధి, భారతీయ జనతా పార్టీపై ఉన్న నమ్మకం, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి తనను శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 2న అధికారికంగా తమ పేరు ప్రకటిస్తారని కాలనీవాసులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి, నరసింహారాజు, లక్ష్మణ్, పవన్ యాదవ్, పాపయ్య, డేవిడ్ పాల్గొన్నారు