- నెక్లస్ రోడ్డులోని జలవిహార్ లో ముస్లిం మైనారిటీ శ్రేణుల విస్తృత స్థాయి ఎన్నికల ప్రచార సమావేశం
- పాల్గొని ప్రసంగించిన ముస్లిం మైనారిటీ శ్రేణుల విస్తృత స్థాయి ఎన్నికల ప్రచార సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనారిటీ శ్రేణుల విస్తృత స్థాయి ఎన్నికల ప్రచార సమావేశం నెక్లస్ రోడ్డులోని జలవిహార్ లో జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమూద్ మొహ్మద్ అలీ పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని, ప్రజల అండదండలు బిఆర్ఎస్ వెంటే ఉన్నాయని వారు అన్నారు.
సమావేశంలో మాగంటి గోపినాథ్ , దానం నాగేందర్ యాదవ్, బాబా ఫసీదుద్దీన్ తో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, కొండాపూర్ డివిజన్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.