- అండగా ఉంటాం.. పార్టీ గెలుపునకు కృషి చేయండి:గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకి చెందిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన 200 మందికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీ శ్రీ రామ రక్ష అని, యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని, యువత ఈ రోజు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులలో కుమార్, యాదేశ్, ఎల్లేశ్, సాయి, అంజి, శ్రీనివాస్, లక్ష్మణ్, సాయి , వెంకటేష్, శ్రీను, విరేశ్ వారి అనుచరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.