- ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి
నమస్తే శేరిలింగంపల్లి : రోజురోజుకు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ఊపందుకుంటున్నది. ఇందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ, సాయి నగర్, కృష్ణ దేవరయ్య కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి, నియోజకవర్గంను అభివృద్ధి చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు నుంచి విశేష స్పందన వస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, చంద్రిక ప్రసాద్, మాధవి, పృథ్వి, రాధిక, ప్రణీత, భవాని, కుమార్, సునీత, మీనా, హరిత, పార్వతి రాజేశ్వరి, యుగంధర్, రజిని, శ్యామల, కాలనీ వాసులు పాల్గొన్నారు.