- బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మంలో నేడు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణా రావు, కేపి వివేకానంద్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్, దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించగా.. నేడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయని చెప్పారు. దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ నాంది అవుతుందన్నారు. నలుగురు ముఖ్యమంత్రులు హేమ హేమీలతో నిర్వహించిన తొలి సభ దేశానికే మార్గం చూపేదని, ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక లక్ష్యం సంక్షేమ భారతమని, ఆయన ఒక గొప్ప విజన్ ఉన్న నేత అని, దేశం గర్వించే విధంగా దేశ రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి సీఎం కేసీఆర్ కే ఉందని చెప్పారు. దేశ ప్రజలకు ప్రతినిధిగా కెసిఆర్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ సీఎం కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.