- సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: పేద ఇండ్ల స్థలాల కోసం భూ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఇజ్జత్ నగర్ లో సిపిఐ మండల సమితి సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో అనేకమంది నిరుపేద లు ఇండ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకపోగా పేదల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పేదలు సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతబట్టి భూ పోరాటాలు నిర్వహించి ఇండ్ల స్థలాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇజ్జత్ నగర్ లో సిపిఐ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి స్థానిక కమిటీ పూనుకోవాలని జిల్లా పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు నియోజకవర్గ కన్వీనర్ టి రామకృష్ణ జిల్లా సమితి సభ్యులు వెంకటస్వామి కే చందు యాదవ్ ఇజ్జత్ నగర్ శాఖ కార్యదర్శి కాసిం సహాయ కార్యదర్శి నరసయ్య జెట్టి శ్రీనివాస్ డి. కృష్ణ ఎస్ నర్సమ్మ, సోమయ్య ఎం. శ్రీను పాల్గొన్నారు.