- ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ లోని శ్రీ శ్రీ శ్రీ హేమదుర్గ మాత ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బిఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండి రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయాన్ని 23 ఏళ్ళ కిత్రం బండి రమేష్ కుటుంబం నిర్మించి..గుడికి సంబందించిన ప్రతి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయానికి బండి రమేష్ ఆలయ ధర్మకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.

నేడు శ్రీ హేమదుర్గ మాత ఆలయ 23వ వార్షికోత్సవంతోపాటు వరలక్ష్మి వ్రతం కావడంతో తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు శ్రీ శ్రీ శ్రీ హేమదుర్గ మాత ఆలయంలో బండి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆలయంలో పెద్ద పూజా కార్యక్రమాలు చేసి 3 వేల నుంచి 5 వేల మందికి అన్న దానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, మియాపూర్ కాలనీ వాసులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బండి రమేష్ అభిమానులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు.






