- నోటు పుస్తకాలను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : నియోజకవర్గ బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి పాలక్ మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ జన్మదిన సందర్భంగా పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా నోట్ పుస్తకాలను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు భాను యాదవ్, మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, బీబీనగర్ డివిజన్ బిజెపి సెక్రెటరీ జితేందర్ , ఓబీసీ మోర్చా డివిజన్ ఉపాధ్యక్షులు మార్ల శ్రీను , డివిజన్ సోషల్ మీడియా ఇన్ చార్జి వినోద్ , శ్రీకాంత్ పాల్గొన్నారు.