- ఆల్విన్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఈశాన్య మూడు రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం బిజెపి కార్యకర్తల్లో జోష్ ను నింపింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విజయంతో అన్ని రాష్ట్రాల్లో భాజాపా ముందుకు దూసుకెళుతుందని ఈ రాష్ట్రాల గెలుపే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి నిదర్శనం కాబోతుందని తెలిపారు.

మోడీ చరిష్మా ఇంకా 10 సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగుతుందని, ఇది కార్యకర్తల నైతిక విజయం అన్నారు. కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని రాహుల్ గాంధీ మోకాళ్ళ యాత్ర చేసిన గాని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేరని, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పెట్టుకున్న కేసీఆర్ పగటి కలలుగా మిగిలిపోవడమే తప్ప ఒరిగేది ఏమీ లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్ రాఘవేందర్ రావు, మణిభూషణ్, నర్సింగ్ రావు యాదవ్, భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, వెంకటస్వామి రెడ్డి, గోపాలరావు, కుమార్ యాదవ్ రాయల్ , సీతారామరాజు, సత్యనారాయణ యాదవ్ , రాజిరెడ్డి, బాలు యాదవ్, శ్రీధర్ పటేల్, రమేష్, పద్మ, దేవి రెడ్డి, రేణుక, అరుణ, పార్వతి పాల్గొన్నారు.