నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ (పార్ట్) పరిధిలోని పాపిరెడ్డి నగర్ , ఆస్బె స్టాస్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలలో పర్యటిస్తున్నమని, కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు.
ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు రాగా.. ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.