- బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈటెల రాజేందర్ కు మోమోరండం
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ని కలిసి బీసీలకు 50 శాతం బిజెపి ఎమ్మెల్యే టికెట్లు బి ఫామ్ ఇవ్వాలని మెమోరాండం సమర్పించారు. టిఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందని, 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేదనీ, బిజెపి పార్టీ బీసీలకు న్యాయం చేయాలని, బీసీలు గెలిచే పరిగి లాంటి నియోజకవర్గాలు ఎన్నో ఉన్నందున బీసీలకు సీట్లు కేటాయించాలని ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ కోరారు. బిజెపి అధిష్టాన వర్గం తో చర్చించి బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ మెమోరండం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బేరి రామచందర్ యాదవ్, కుమార్ యాదవ్ శ్రీరామ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి, పరిగి అన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయగా.. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.