- బిజెపి కార్యాలయ ప్రారంభోత్సవంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పరిధి లింగంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ మాట్లాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ నాయకులు నిర్వహించిన ఇంటి ఇంటికీ ప్రచార కార్యక్రమంలోను ఆయన పాల్గొన్నారు.