అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

  • ఎల్లమ్మ బండలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి హనుమాన్ దేవాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, తులసి నగర్, ధరణి నగర్, చక్రధరి నగర్, వెంకట పాపయ్య నగర్, కాకతీయ నగర్, పంచమి కాలనీ, ఎల్లమ్మబండ కాలనీలలో ఇంటింటి ప్రచారం చేసి, ఎల్లమ్మ బండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ను రూపు రేఖలు మార్చడం జరిగినదని, అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ధరణి నగర్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపమని అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ఆల్విన్ కాలనీ పరిధిలో కూరగాయల మార్కెట్ వద్ద ప్రభుత్వ విప్ గాంధీ ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని, రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ప్రచారంలో కార్యకర్తలు, నాయకులతో..

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని, సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని, బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధిస్తుందని, ప్రతిపక్షాలకు ఊహ కందని విధంగా రూపొందించడమైనదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతని, రైతు బంధావుడు, మహిళల పక్షపాతని, ఈ మ్యానిఫెస్టో ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ఉందని, సంక్షేమం, అభివృద్ధి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగినదని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం, ఆసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయమని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతిని అందించడం గొప్ప విషయమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని పూర్తి ప్రణాళికను వివరించారు. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశలవారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు ప్రకటించిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here