నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, ఆరంభ టౌన్ షిప్ కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో రూపొందించారని తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.