కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : మునుగోడు బీజేపీ క్యాంప్ కార్యాలయంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని రాష్ట్ర బిజెపి నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గులాబీ సర్కారు అవినీతిపై ధర్మంగా ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు అర్థం చేసుకుని భారీ మేజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని తెలిపారు. కార్యక్రమంలో వారితో పటాన్ చేరు మాజీ జడ్పీటిసి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, శెరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ పద్మ , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్ , తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, ఇందిరా, మీరా భాయ్ పాల్గొన్నారు.

మునుగోడు బీజేపీ క్యాంప్ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here