నమస్తే శేరిలింగంపల్లి : మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి, రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జోగిగూడెం గ్రామ ప్రజలను కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలోని జోగిగూడెం గ్రామంలో గడపగడపకు తిరిగి తెరాస పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకొని ఓట్లు వెయ్యాలని ఓటర్లను అభ్యర్ధించారు. మునుగోడు ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవటం ఖాయమని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టి, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ఘనతని అన్నారు. తెరాస నాయకులు రవి శంకర్ నాయక్, స్వామి సాగర్, లక్ష్మణ్, సాయిబాబు సాగర్ శేఖర్ గౌడ్, సత్యం గౌడ్, అంజయ్య యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకన్న గౌడ్, చిలకమర్రి గణేష్ పాల్గొన్నారు.