నమస్తే శేరిలింగంపల్లి : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు మున్సిపాలిటీ 8వ వార్డులో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించి పదవి త్యాగం చేసి మునుగోడు ప్రజల ఆత్మాభిమానం చాటడానికి బరిలో నిలిచిన మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చేరు మాజీ జడ్పీటిసి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, శెరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ పద్మ, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్ , తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, ఇందిరా, మీరా భాయ్ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.