- ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ 109 డివిజన్ లోని సాయినగర్, యూత్ కాలనీలలో డివిజన్ ఇన్చార్జి బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేష్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కాలనీలోని ప్రతి గడపకు వెళ్లి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వల్ల హరీష్, లక్ష్మారెడ్డి, కె .వెంకటేష్ గౌడ్, కె.శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి, ఎన్. శేఖర్ గౌడ్, ఎన్.రామకృష్ణ గౌడ్, మనోహర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, పవన్ గౌడ్, గంగారాం రాజు, మనోహర్ గౌడ్, సయ్యద్ సాదిక్, కంది జ్ఞానేశ్వర్, షబానా, జమ్మర్, సాబెర్, సుదీష్, భాస్కర్ గౌడ్, బాబు గౌడ్, జనార్దన్ గౌడ్, బాబు మోహన్, మల్లేష్, దాస్, భగత్, శ్రవణ్, అమ్జత్ ఖాన్,సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.