నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని ఇందిరానగర్, గచ్చిబౌలి విలేజ్, చిన్న అంజయ్య నగర్ లలో స్థానిక నాయకులతో కలిసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు పాంప్లెట్స్ పంచి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపించారన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. కాంగ్రెస్..ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. “కారు గుర్తుకు ఓటు వేసి” బంపర్ మెజారిటీతో కాసానిని గెలిపించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, బూత్ కమిటీ మెంబర్లు, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్, ఇందిరానగర్ నాయకులు, చిన్న అంజయ్య నగర్ నాయకులు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.