నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ, పద్మజానగర్, రాజేంద్రరెడ్డి నగర్, సురక్ష ఎన్ క్లేవ్, శుభోదయ కాలనీ, డిఫెన్స్ కాలనీ, విద్యానగర్ కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి కాసాని చంద్రకళ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఇంటిటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని పేదలకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని కొనియాడారు. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.