శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన హుడాకాలనీ వాసులు, హఫీజ్ పేజ్ పార్టీ బృందం
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గాంధీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, హుడా కాలనీ వాసులు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, హుడా కాలనీ వాసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, తనపై చూపిన ఆధారభిమానాలకు ధన్యుడినని, అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాల హరీష్ రావు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, దాత్రి నాథ్ గౌడ్, విమల్ కుమార్, రవీందర్ రెడ్డి, మల్లేష్, జనార్దన్ గౌడ్, తిరుమలేష్, కంది జ్ఞానేశ్వర్, ప్రశాంత్, రాజేశ్వర్ గౌడ్, రాజు, వెంకట్ రెడ్డి, పవన్, భగత్, గోపి, శ్రవణ్, హుడా కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.
