ఐకమత్యంతో ముందుకెళ్తాం.. అధికారం సాధిద్దాం

  • తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపు
  • తెలంగాణ బీసీ ఐక్యవేదిక, బీసీ ఫెడరేషన్, జెబిసి సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యనాయకులతో సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ బీసీ ఐక్యవేదిక, బీసీ ఫెడరేషన్, జెబిసి సంఘాల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజక వర్గం టీఎన్జీవోస్ కాలనీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు హైదరాబాద్ లో రథయాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తమ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. మొదటగా జై బీసీ అధ్యక్షులు కస్తూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు, జై బీసీ ఆర్గనైజేషన్ గురించి చర్చించారు. అనంతరం తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నాలుగు సంఘాలు కాకుండా విస్తృతంగా మరికొన్ని ముఖ్య సంఘాలను ఆహ్వానించి చర్చించి నిర్ణయం తీసుకుందామని కోరారు.

తెలంగాణ బీసీ ఐక్యవేదిక, బీసీ ఫెడరేషన్, జెబిసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కరపత్రం ఆవిష్కరించిన భేరి రాంచందర్ యాదవ్, ఆర్కే సాయన్న తదితరులు

ఐకమత్యంతో అడుగు ముందుకేసి కచ్చితంగా పనిచేసే అధికార సాధనలో ముందుకెళ్దామని చెప్పారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మాట్లాడుతూ జేఏసీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందులో అన్ని సంఘాలను కలుపుకొని సమాఖ్య రూపంలో ముందుకెళ్దామని తెలిపారు. నందకుమార్ యాదవ్ ప్రసంగిస్తూ ఐకమత్యంతో అధికార సాధన ముఖ్యమని తెలిపారు. ప్రతిష్టమైన ప్రణాళిక ద్వారా ముందుకెళ్లాలని సూచించారు లింగంపల్లి బిసి ఐక్యవేదిక అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ ముందుగా శేరిలింగంపల్లిని మాడల్ గా తీసుకొని ప్రజా సమస్యల మీద పనిచేసే విధానం కావాలన్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లిలో వాడవాడలా కమిటీలు వేయాలని తెలిపారు. మియాపూర్ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఐకమత్యం మనకు బలం, ముందుగా శేరిలింగంపల్లిని పటిష్టం చేద్దామని పిలుపునిచ్చారు.

 

యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ ఆర్గనైజేషన్ పేరు ఖరారు చేసి ఉద్యమ బాట ద్వారా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు సహాయం చేద్దామని చెప్పారు. కూకట్పల్లి ఏరియా ప్రధాన కార్యదర్శి సెల్వరాజ్ మాట్లాడుతూ యువత మీ పెద్దల సలహాలతో ముందుకు వచ్చి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలతో మమేకమే పని చేద్దామని సూచించారు. డాక్టర్ సత్యనారాయణ ముఖ్య సలహాదారు ఆర్గనైజేషన్ పేరు ఖరారు చేసి అందరూ కలిసి పని చేద్దామని, బీసీ ఆర్గనైజేషన్ బలోపేతం చేసి ముందుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేద్దామని చెప్పారు. కనకాచారి మాట్లాడుతూ ఉద్యమ రూపంలో ముందుకెళ్లి, ఐకమత్యంతో బలమైన పోరాటం చేసి అధికారం సాధిద్దామని, దానికయ్యే ఖర్చులు భరించటానికి ఆర్థికంగా అందరూ సిద్ధంగా ఉండాలని, అధికారమే అంతిమ లక్ష్యమని తెలిపారు. మధుకరాచారి మాట్లాడుతూ జెసి ఏర్పాటు చేసి అందరిని ఏకం చేసి సంఘాలు కలిసి అధికార సాధనలో భాగస్వాములై ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేద్దామని తెలిపారు. స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అందరూ కలిసి ఐకమత్యంతో సాధించలేనిది ఏమీ లేదని చెప్పారు.
కస్తూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీ మనుగడ పార్టీతోనే ముడిపడి ఉందని, అన్ని కులాలను సంఘాలను నాయకులను కలుపుకొని ఉద్యమం చేస్తే అధికారం సాధ్యమని, బేరి రామచంద్ర యాదవ్ చెప్పిన దిశగా అధికార దిశగా పయనిద్దామని, అధికారం ముఖ్యమని పేదల కష్టాలు దూరమవ్వటానికి కృషి చేయాలని, సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here