నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్ ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆల్విన్ కాలని 124 డివిజన్ అధ్యక్షుడు అబోతుల మాధవరావు నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిభిర సేవలు వినియోగించుకున్నారు. కార్యక్రమం పట్ల కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావ్యనిక వైద్య బృందం, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.