కాంగ్రెస్ లోకి  హైదరనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు, ఆయన బృందం

నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం హైదరనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు, ఆయన బృందం తన నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో వారికి ఆ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే దిశగా పనిచేద్దామని  చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here