ఆరెకపూడి గాంధీని భారీ మెజారిటీతో గెలిపించండి

  • మియాపూర్ డివిజన్ పరిధిలో  కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ, నీలిమ గ్రీన్స్ కాలనీ, రాధ మాధవ్ అపార్ట్మెంట్స్ లలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

మియాపూర్ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ, నీలిమ గ్రీన్స్ కాలనీ, రాధ మాధవ్ అపార్ట్మెంట్లలో ప్రజలకు శ్రీకాంత్  విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ, నీలిమ గ్రీన్స్ కాలనీ, రాధమాధవ్ అపార్ట్మెంట్స్ లలో ఈ రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రజలనుంచి మంచి స్పందన ఉందని, మళ్లీ గాంధీకే మద్దతు అంటూ ప్రజలు చెబుతున్నా రన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో అరెకపూడి గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇద్దామన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ..

ముఖ్యంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందినవారు పెద్ద సంఖ్యలో పార్టీలో  చేరుతున్నారని, పార్టీలో చేరిన వారంతా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని, తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here