కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆరెకపూడి గాంధీకి ఘన సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ హ్యాట్రిక్‌ విజయం సాధించారని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ శుభసందర్భంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందిస్తున్న దృశ్యం

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు, బస్తీ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ఆరెకపూడి గాంధీతో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here