ప్రపంచానికి రాజ్యాంగం ఒక రోల్ మోడల్

  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 67 వ వర్థంతి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళ్ళర్పిస్తున్నామని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మహనీయునీ విగ్రహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ

రాజ్యాంగ సృష్టికర్త, మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యంగ నిర్మాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిందుడు, రాజనీతిజ్ఞుడు, ప్రపంచ మేధావి, దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు, ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు. అందరికి సమానత్వం ఉండాలని, అంటరానితనం, అసమానతలు, వివక్షాల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబా సాహేబ్ అని తెలిపారు. కోట్లమంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి అంబేద్కర్ అన్నారు. ఆయన చూపిన బాటలో యువత పయనించాలని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న గాంధీ

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, వేణు, అన్వర్ షరీఫ్, ప్రవీణ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, వెంకటేశ్వర రావు, రఘునాథ్, గోపాల్, దామోదర్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here