నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్శకుల ఆదరణను చూరగొంటున్నది. శిల్పారామం లో వివిధ రాష్ట్రాలనుండి దాదాపుగా 500 స్టాళ్లలో కొలువుదీరిన వివిధ రకాల వస్త్రాలు వారి మదిని దోచుకుంటున్నాయి.

బెంగళూరు సిల్క్స్, బనారస్ పట్టు, టేబుల్ లాంప్స్,పైతాని సారీస్, మధుబని పెయింటింగ్,బ్లాక్ మెటల్, బుట్టలు, జ్యూట్ క్రాఫ్ట్స్, వాల్ హ్యాంగింగ్స్, బ్యాగ్స్, డెకొరేటివ్ ఐటమ్స్, పప్పెట్స్ , ఆర్టిఫిషల్ జ్యువలరీ, టెర్రకోట, బ్లూ పట్టారీ , వరంగల్ కార్పెట్స్ , డ్రెస్ మెటీరియల్స్ చెక్కనం బొమ్మలు, విగ్రహాలు మరెన్నో ఆకర్షణీయంగా ఉన్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ స్పాన్సర్ చేసిన గారడీ గొంబే బుట్టబొమ్మలు సూర్యప్రకాష్ బృందం ప్రదర్శించిన నృత్యం, త్రిప్తి నగర్ ఉజ్జయిని నుండి విచ్చేసిన జానపద నృత్యం బెంగళూరు నుండి విచ్చేసిన కాత్యాయనీ బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు ఐఏఎస్, అవార్డు గ్రహీతలు చేనేత హస్త కళాకారులూ అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళను ప్రారంభించారు.