గొల్ల కురుమల సమస్యలు పరిష్కరించాలి

  • ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్, ముఖ్య సలహాదారు బేరి రామచందర్ యాదవ్ వినతి పత్రం అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : గొల్ల కురుమల సమస్యలపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్, ముఖ్య సలహాదారు బేరి రామచందర్ యాదవ్ వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ ఎమ్మెల్యేకి విన్నవిస్తూ గత ప్రభుత్వం గొర్ల కాపరులకు గొర్రెల పంపిణీ చేస్తున్నట్టు వారితో డీడీలు కట్టించుకుని మోసం చేసిందని పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ చేస్తారని గొల్ల కురుమలు అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని (రూ.43,750) గత ప్రభుత్వానికి డీడీలు కట్టగా ఆ ప్రభుత్వం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని లేనియెడల సదరు గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయం గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, తొందరగా గొర్రెల స్కీం నగదు బదిలీ సందర్భంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గొల్ల కురుమల సమస్యలపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వినతిపత్రం అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్, ముఖ్య సలహాదారు బేరి రామచందర్ యాదవ్

మంచిర్యాల జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పశువైద్యశాలని పునర్దరించాలని, నట్టల మందులు సీజనల్ వ్యాక్సిన్లు పెంచాలని, రెండో విడత గొర్రెల పంపిణీ త్వరగా చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో గొల్ల కురుమ సోదరులు యాదవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ్ సంగం కార్యదర్శి వై శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, కృష్ణ యాదవ్, సుదర్శన్ యాదవ్, జంగయ్య యాదవ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here