నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయిబ్రాహ్మణుల ఆత్మగౌరవం పెంపొందించేలా అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయిబ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు రవి కుమార్ నాయి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ వినతి అందజేస్తున్న దృశ్యం

శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయిబ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు రవి కుమార్ నాయి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు జగదీశ్వర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవికుమార్ నాయి, ఉపాధ్యక్షులు సాయిలునాయి, జనరల్ సెక్రెటరీ రవీందర్ నాయి, దశరథ్ నాయి, భాస్కర్ నాయి, భిక్షపతినాయి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here