- మియాపూర్ లో ప్రభుత్వ పాఠశాలలో రూ. 1 కోటి 51 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం
- శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని రూ. 1 కోటి 51 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే CDP ఫండ్స్ (SD Funds) ప్రత్యేక నిధులతో చేపట్టబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ,” మన ఊరు.. మన బడి ” కార్యక్రమం ద్వారా రూ.7,300 కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కలిపించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని ,మెరుగైన మౌలిక వసతులు కలిపిస్తామని, పిల్లలకు చదువుకోవడానికి వీలుగా అనువైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.