- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. ఉచిత మెగా వైద్య శిబిరం
- 110 మందికి వైద్యసేవలు
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్ లో నీలిమా హైట్స్, గ్రీన్స్ వద్ద మెడికవర్ హస్పటల్, చందానగర్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిచారు. ఈ శిబిరంలో 110 మందికి వైద్యసేవలు అందించగా .. ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి, దంత, పరీక్షలతో పాటు ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషన్), డాక్టర్ రామ్స్ (నేత్ర వైద్యులు), డాక్టర్ వింధ్య (దంత వైద్యులు) వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరు నిత్య వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక కనీసం 40 నిమిషాలు చేయాలని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, రమేష్, సాంబశివరావు, సీతారామ్, రాజేంద్రప్రసాద్, రాహుల్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, అజయ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ మరియు హాస్పిటల్ ప్రతినిధులు నరేష్ పాల్గొన్నారు.