ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్

  • 69వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ గడపగడపకు బిజెపి నినాదంతో మియాపూర్ డివిజన్ కృష్ణ సాయి ఎంక్లేవ్, లక్ష్మీ వెంకట్ నగర్, HMT స్వర్ణపురి కాలనీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలనుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని తెలుపుతూ పాదయాత్రలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ప్రధానంగా డ్రైనేజీ, సీసీ రోడ్స్, మంజీరా నీటి సమస్య ఉందని పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, మాణిక్ రావు, రమేష్, గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్, మహేష్ ముదిరాజ్, శ్రీనివాస్, రాము, రామకృష్ణారెడ్డి, విజేందర్, పవన్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here