నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎండి మహబూబ్ పాషా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రతినిధి ఎస్ సత్యం రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరితోపాటు మాదాపూర్ డివిజన్ నుంచి ఎండి జహంగీర్ , మోసిన్ కూడా చేరగా… సత్యం రావు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎండి జమీర్, భరత్ గాంధీ రెడ్డి, కమర్ పాషా, మహమ్మద్ కాజా, ఆసిఫ్ పటేల్, ఆయాజ్ అహ్మద్, అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.