నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలోని బక్షి కుంట చెరువు సుందరికరణ పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బక్షి కుంట చెరువుకు దశ దిశ మారినదని, ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినదని, మురికి కూపంలాంటి చెరువును స్వచ్చమైన మంచి నీటి చేరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయం అన్నారు.
Phenom people IT కంపెనీ CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరికరణ చేపట్టేందుకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయమని, సమాజ హితం, సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.