- రాష్ట్ర మాల పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య
నమస్తే శేరిలింగంపల్లి: ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరిని తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఇజ్జత్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన మాలలకు ప్రభుత్వ పథకాల అమలులోను, రాజకీయంగాను తీరని అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాలపై మాల సామాజిక వర్గాన్ని చైతన్యపరిచేందుకు మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 నుండి ఆదివారం నుంచి బస్తి బాట చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి నిర్ణయించిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లను తీర్మానించింది.
1. ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గం ఉష మెహెరా కమిషన్ కు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తుంది.
2. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేని ఉష మెహెరా కమిషన్ ను వెంటనే బుట్ట దాఖలు చేయాలని మాల సామాజిక వర్గం డిమాండ్ చేస్తుంది.
3. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఎస్సీ కులాల జనాభా లెక్కలపై సర్వే నిర్వహించాలి.
4. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జీవన పరిస్థితులపై అధ్యాయం చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ ను నియమించాలి.
5. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మాల జనాభా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు 10 అసెంబ్లీ సీట్లు కేటాయించాలి.
6. ఎస్సీలలో అత్యధికంగా వెనుకబడిన కులాలను గుర్తించి వారికి ప్రత్యేకమైన అభివృద్ధి పథకాలతో ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసి తగిన నిధులు కేటాయించాలి.
7. ఎస్సీల సంవత్సర ఆదాయం రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి. ఈ డబ్ల్యూ ఎస్ విధించిన అర్హతలను వర్తింపజేయాలి.
8. ఎస్సీ రిజర్వేషన్ కోటాను 20 శాతానికి పెంచాలి.
9. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.
10. కేజీ టు పీజీ ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలి.
11. ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల జూనియర్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి.
12.దళితులకు 3 ఎకరాల భూమి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు.
13. ఇల్లు లేని ప్రతిదళిత కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి.
14. స్థలం. ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయాలి.
15. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి.
16. ప్రతి జిల్లాలో మాల సామాజిక ఆత్మగౌరవ భవనానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలి భవనం నిర్మించేందుకు రెండు కోట్ల నిధులు మంజూరు చేయాలి.
17. హైదరాబాదులో మాల సామాజిక ఆత్మగౌరవ భవనం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి మూడు కోట్ల నిధులు కేటాయించాలి.
18. ప్రతి జిల్లాలో పోటీ పరీక్షల శిక్షణ కోసం స్టడీస్ సెంటర్ ను పర్మినెంట్గా ఏర్పాటు చేయాలి.
19. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నెలకొలపాలి.
20. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం కింద ప్రతి ఏటా 1000 మంది విద్యార్థులను విదేశాలకు పంపాలి. ఈ పథకం కింద ఇప్పుడు ఇస్తున్న 20 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలి.
21. దళితులకు పరిశ్రమలు స్థాపించుటకు ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలి.
22. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీం కేవలం ఇంజనీరింగ్ వంటి కోర్స్ లకే కాకుండా ఎంబిబిఎస్ వంటి వైద్య పరమైన కోర్సులకు కూడా వర్తింపచేయాలి.
23. భాగ్యరెడ్డి వర్మ, ఈశ్వరి బాయ్, గద్దర్, పివి రావుల విగ్రహాలను టాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి.
24. కేంద్రం అమలు చేయనున్న మహిళ రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ మహిళల వాటా తేల్చాలి.
25. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి.
అదే విధంగా నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మాలల అలైబలై కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మాలలు, మాల మేధావులు మాల విద్యార్థులు అడ్వకేట్లు, కళాకారులు, మహిళలు, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో వేదికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి వైస్ చైర్మన్లు మన్నే శ్రీధర్ రావు, మద్దెల వెంకటయ్య, తలారి అంజి, సంఘం కురుమూర్తి సంగమల వాసు, జట్టి కురుమయ్య, అవుల ఆంజనేయులు, జెట్టి కేశవులు కుడుముల శివ, ఎద్దుల సంగమయ్యలు పాల్గొన్నారు.