- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
- ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ కృష్ణ యూత్/జగదీశ్ యువ సంఘటన సభ్యులు వివేక్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపునకు విశేష్ స్పందన లభించిందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మమత హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపులో సుమారు 1200 మందికి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని, వైద్యుల పరీక్షల అనంతరం 100 మందికి శాస్త్ర చికిత్సలు, 28 మంది గర్భవతి మహిళలకు కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశనట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా మమత హాస్పిటల్స్ లో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలను పరామర్శించి, అవసరం ఉన్న అన్ని రకాల వైద్య సేవలు తమ నియోజకవర్గ ప్రజలకు అందించాలని, తమ వంతు సహకారం ఉంటుందని మమత హాస్పిటల్స్ సుపరింటెండెంట్ ని కలిసి వివరించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యం అని, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎప్పుడు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు.