- కేంద్ర మంత్రులను కలిసి సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్
నమస్తే శేరిలింగంపల్లి : ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డి.కే అరుణని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ ఢిల్లీలోని వారి నివాసంలో ప్రత్యక్షంగా కలిసి శాలువతో సత్కరించి వారికి శుభాభివందనాలు తెలిపారు.
ఢిల్లీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను కలువడం చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ గంగాధర్ పేర్కొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ లో బిజెపి మరింత బలపడడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటేస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి కంటేస్టెడ్ కార్పొరేటర్ ఏల్లెష్ పాల్గొన్నారు.