తెరాస అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌

గచ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి కొమిరిశెట్టి సాయిబాబాను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. శ‌నివారం క‌డియం శ్రీ‌హ‌రిని నేతాజీన‌గ‌ర్ కాల‌నీ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భేరి రామ‌చంద‌ర్ యాదవ్ క‌లిసి మ‌ద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌డియం శ్రీ‌హ‌రి మాట్లాడుతూ తెరాస అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే న‌గ‌రం అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ఓటు వేస్తే వృథా అవుతుంద‌న్నారు.

ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రిని క‌లిసిన భేరి రామ‌చంద‌ర్ యాదవ్

భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కొమిరిశెట్టి సాయిబాబాలు తమ కాల‌నీలో ఎన్నో అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టార‌ని అన్నారు. కాల‌నీ ప్ర‌జ‌లు కొమిరిశెట్టి సాయిబాబాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ ఎన్నికల పరిశీల‌కురాలు విజయ, నల్లగండ్ల ఎలక్షన్ బూత్‌ ఇంచార్జ్ రాంబాబు, తాటికొండ వెంకటేష్ యాదవ్, కార్యదర్శి పోగుల సారంగపాణి, మల్కాపురం లక్ష్మయ్య గౌడ్, శివయ్య గౌడ్, అరుణమ్మ, ఎండీ ఆశ బేగం, మౌలానా, యువజన నాయకులు పి గిరిబాబు, భేరి చంద్రశేఖర్ యాదవ్, కేశం శివ యాదవ్, మిద్దెల బన్నీ యాదవ్, పంతం శీను, రమేష్ గుప్తా, శ్రీ కృష్ణ కాలనీ అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్, ఎండీ ముజీబ్, ఎండీ నబీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here