వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్‌లో అధికార పార్టీ నాయకులు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం బీజేపీ వైపే ఉన్నారని డివిజన్ బీజేపీ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. గ్రేటర్ కార్యాలయంపై కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు.

