గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు గచ్చిబౌలి డివిజన్ నుంచి తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. వందలాది మంది తెరాస నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో సభకు తరలివెళ్లారు. ఆ వాహనాలను డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా జెండా ఊపి ప్రారంభించారు.