- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
- ఏఐఎఫ్దీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి
నమస్తే శేరిలింగంపల్లి : కలకత్తాలో వైద్య విద్యార్థి ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని(ఎ ఐ ఎఫ్ డి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. మియాపూర్ ఎక్స్ రోడ్ లో దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మహిళా సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు శివాని, యువజన సంఘం మహిళా కన్వీనర్ సుల్తానా బేగం మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు.
కలకత్తా నగరంలో ట్రైని డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళపై పోలీసు ముసుగులో ఉన్నా దుండగుడు ఆయన అనుచరులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేయడం దారుణమైన విషయం అన్నారు. కార్యక్రమంలో (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య, నాయకులు శివాని, జ్యోతి, జగదీశ్వరి, ధనలక్ష్మి, యాదమ్మ, కనకమ్మ, గీత, రాములమ్మ పద్మ, ఇందిరా, అమీనా బేగం (ఏఐఎఫ్డీవై) నాయకులు సుల్తానా బేగం, వెంకట చారి (ఏఐఎఫ్డీఎస్) నాయకులు మోతే రాములు సంతోష్ మోతే రజియాబేగం విద్యార్దులు హాజరయ్యారు.