బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి : రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

  • 8వ రోజుకు చేరుకున్న మండల్ దివస్

నమస్తే శేరిలింగంపల్లి : మండల్ దివస్ 8వ రోజు కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక శేరిలింగంపల్లి అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగింది. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రసంగిస్తూ మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం 40 పాయింట్లు అమలు పరచాలని, ఇందుకు కావాల్సిన జీ.వో.లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

8వ రోజు మండల్ దివస్ కార్యక్రమంలో నినాదాలు చేస్తున్న రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

స్థానిక సంస్థల ఎన్నికలలో కార్పొరేటర్, మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, సంతోష్ యాదవ్ ముదిరాజ్, సెంట్రింగ్ కాంట్రాక్టర్, గర్ల సంతోష్ యాదవ్, పవన్ యాదవ్, మహిళా బీసీ సంఘం నాయకులు దీపిక, కృష్ణవేణి, అంజమ్మ, లక్ష్మీ, రాజు గౌడ్, వడ్డే అశోక్, రాము పద్మశాలి, సాకలి కిషోర్, మంగలి కృష్ణ, మేదరి సంఘం వెంకటేష్, సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here