- స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎంపి, కార్పొరేటర్
- శ్రీవారికి, అమ్మవార్లకు స్వర్ణ కంఠాభరణాలు సమర్పించిన కలిదిండి సత్యనారాయణ రాజు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత వేంకటేశ్వరాలయ సముదాయంలో శ్రీవారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవరోజు ఘనంగ కొనసాగాయి. ఆలయ ప్రధానార్చకులు, పీఠం తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి బృందం పర్యవేక్షణలలో ఆదివారం స్వామివారికి నిత్యోపాశనం, ఉత్సవాన్తస్నపనంతో పాటు శ్రీవారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డిలు బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ అర్చక బృందం వారిని శ్రీవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. చందానగర్ పోలీస్‌స్టేషన్ డీఐ నర్సింగ్ రావు, మంజుల దంపతులు కుమారుడు నిక్షిత్‌తో కలసి స్వామి వారి కల్యాణంలో భాగస్వాములయ్యారు. అనంతరం స్వామి వారికి అన్నసమారాధన నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు, ఆలయ పాలకమండి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారి కల్యాణాన్ని తిలకించారు.
త్వరలోనే శ్రీవారి ధ్వజస్థంభానికి బంగారు తాపడం
చందానగర్ శ్రీ వెంకటేశ్వరాలయ మహారాజ పోషకులు కలిదిండి సత్యనారాయణ రాజు, జాన్సిలక్ష్మీ దంపతులు పద్మావతి, గోధాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్లకు ముత్యాలు పొదిగిన మూడు స్వర్ణ కంఠాభరణాలు బ్రహ్మోత్సవాలో భాగంగా సమర్పించారు. అదేవిధంగా త్వరలోనే ఆలయంలోని వెంకటేశ్వరస్వామి ధ్వజస్థంభానికి బంగారు తాపడం చేయిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆలయాభివృద్ధికి అనేక రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తున్న కలిదిండి సత్యనారాయణ రాజు దంపతులు ద్వజస్థంభానికి బంగారం తాపడం ప్రక్రియను మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఐతే శ్రీవారు ఇస్తున్నదాంట్లో తోచినంత ఆయన సేవకు కేటాయించడం తన భాద్యతగా బావిస్తున్నట్టు వారు మహారాజ పోషకులు కలిదిండి దంపతులు పేర్కొన్నారు.