- చందానగర్ డివిజన్ బిజెపి సమావేశంలో రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ చందానగర్ డివిజన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు స్థానిక మహిళలు బిజెపిలో చేరారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, నాగం రాజశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డిలు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవలి వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో అధికార పార్టీ విఫలమైందని, డబ్బుల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తాము వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు నూనె సురేందర్, రాకేష్ దూబే, వేణుగోపాల్ పగడాల, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్, కళ్యాణ్, లలిత, శోభ దూబే మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.