చందానగర్ బిజెవైఎం అధ్యక్షుడిగా టి.మధుసూదన్ రావు

మధుసూదన్ రావు కు నియామక పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి ) శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా స్థానిక బిజెపి నాయకుడు తన్నీరు మధుసూదన్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి మధుసూదన్ రావు కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. కార్యకర్తలు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగ పరచుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి రామ్ రెడ్డి, బీజేవైఎం శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ కుమ్మరి జితేందర్ తో పాటు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here