ఆధ్యాత్మికం(నమస్తే శేరిలింగంపల్లి): దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు వారు. నగరంలో ఒకేచోట కలిసి నివసిస్తుండటంతో వారి ఆలోచనలు ఏకమయ్యాయి. ప్రతీయేడు దసరా పండుగకు నిర్వహించే సామూహికంగా ఉత్సవాలలో భాగంగా వివిధ నృత్య రూపకాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే విధంగా దుర్గాదేవి పై భక్తి శ్రద్ధలను ప్రదర్శించడం వారికి ఆనవాయితీ గా మారింది. కరోనా కారణంగా ఈ ఏడాది సామూహిక నృత్య ప్రదర్శన సాధ్యం కాదని గ్రహించి సామాజిక దూరం పాటిస్తూ వీడియో ద్వారా తమ నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరుస్తున్నారు.
శేరిలింగంపల్లి లోని నలగండ్ల అపర్ణ సరోవర్ కు చెందిన 18 మంది మహిళలు రెండు నెలల పాటు శ్రమించి పలు సాంస్కృతిక నృత్యరూపకాలతో తాల్ దుర్గ 2020 పేరిట రూపొందించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నృత్యరూపకానికి ఆనందిత ఖమంకార్ దర్శకత్వం వహించారు. ఆస్ట్రేలియా లోని సిడ్నీ, అమెరికా సియాటెల్ ప్రాంతంలోని యువతులు, మహిళలు సైతం ఈ నృత్యం లో పాలు పంచుకోవడం విశేషం.
ఇంకెందుకు ఆలస్యం 15 నిమిషాల నిడివి గల ఈ వీడియో ను మీరూ చూసి ఆనందించండి.