వాయిస్ అండ్ స్పీచ్ వర్క్ షాప్ సీజన్ 3 ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: భాషా సాంస్కృతిక శాఖ, సురభి కళాక్షేత్రం, డిడి ఎం ఎస్ సంయుక్త నిర్వహణలో వాయిస్ & స్పీచ్ వర్క్ షాప్ సీజన్ -3 ఘనంగా ప్రారంభమైంది. డిడిఎంఎస్ లిటరసీ హౌస్ వేదికగా ప్రారంభమైన వర్కషాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరిక్రిష్ణ హాజరై భాష ప్రాముఖ్యత, దాని విలువ, అవకాశాలు గురించి వివరించారు. అంతేకాక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి ఎమ్ రాజు రేడియో, టివి, సినిమా రంగాలలో వాయిస్ ప్రాముఖ్యత , అవకాశాల గురించి వివరించారు.

సీజన్ 3లో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో కోర్సులను, స్కిల్ డెవలప్ మెంట్ వర్కుషాప్స్ ని నిర్వహిస్తున్న లిటరసీ హౌస్ డైరెక్టర్ కంచర్ల లక్ష్మీ, డాక్టర్ సాయి ఆచార్య (లైఫ్ మేనేజిమెంట్ కోచ్), ఆర్ జె స్వాతి ( పోయెట్ & స్పీకర్ ) పాల్గొన్నారు. వాయిస్ & స్పీచ్ వర్క్ షాప్ సీజన్ -3 శిక్షణా తరగతులు ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 8 వరకు 30 రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటిలోని డి డి ఎం ఎస్ లిటరసీ హౌస్ కొనసాగనున్నాయి.


అయితే వర్కుషాప్ లో జాయిన్ అయిన ఔత్సాహిక అభ్యర్థులందరికీ, ఈ అవకాశం కల్పించిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ మామిడిలకు ఆర్ జె వాయిస్ & యాక్టింగ్ ట్రైనర్ డాక్టర్ సురభి రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here